ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 7 గంటల తర్వాత మటన్ బిర్యానీ, కారంగా ఉండే వంటకాలు(స్పైసీ ఫుడ్), స్వీట్లు, బజ్జీలు, పకోడీలను తినడం వల్ల జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొన్నారు. రాత్రిపూట టీ తాగితే కెఫీన్ వల్ల రక్తపోటు పెరిగి, నిద్రకు ఆటంకం కలిగుతుందని అంటున్నారు. కాబట్టి రాత్రి వేళల్లో తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.