మద్యంలో కూల్‌డ్రింక్ కలుపుకుని తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మత్తును త్వరగా పెంచి, శరీరంపై అదనపు భారాన్ని కలిగిస్తుంది. కూల్‌డ్రింక్స్‌లోని గ్యాస్ వల్ల ఆల్కహాల్ రక్తంలోకి వేగంగా కలిసిపోతుంది. దీనివల్ల త్వరగా మత్తు వస్తుంది. తీపి, ఫ్లేవర్ల వల్ల మద్యం ఘాటు తెలియదు. రక్తపోటు, గుండె స్పందన వేగం పెరగవచ్చు. కెఫైన్ ఉండే పానీయాలు కలిపితే గుండెపై మరింత ఒత్తిడి పడుతుంది