ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..?

8చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..?
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కేటాయింపులకు సిద్ధమైంది. దసరా తర్వాత వారం రోజుల్లో లాటరీ నిర్వహించి, దీపావళిలోపు లబ్ధిదారులను ఎంపిక చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లోని అర్హులకు హయత్ నగర్, నాంపల్లి, జమిస్థాపూర్, ఫలక్ నుమా ప్రాంతాల్లో ఫ్లాట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులను ఎంపిక చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్