తెలంగాణలో దసరా సెలవులు ముగిశాయి. 13 రోజుల తర్వాత శనివారం నుంచి విద్యార్థులు బాట బడి పట్టనున్నారు. ఊర్లకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం చేరుకుంటున్నారు. అయితే శనివారం ఒక్కరోజు పాఠశాలకు వెళ్తే రేపు(ఆదివారం) మళ్లీ సెలవే. దీంతో పిల్లలతో ఊరెళ్లిన చాలా మంది తల్లిదండ్రులు ఈ రెండు రోజులు కూడా అక్కడే ఉండి, సోమవారం నుంచి స్కూల్కు పంపాలని చూస్తున్నారు.