నీట్ పేపర్ లీక్ కేసులో ముగిసిన వాదనలు

1చూసినవారు
నీట్ పేపర్ లీక్ కేసులో ముగిసిన వాదనలు
దేశంలో సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసు విచారణ కీలక దశకు చేరింది. 14 మంది నిందితులపై అభియోగాల నమోదుకు సంబంధించి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఇవాళ తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నవంబర్ 18న తీర్పు వెలువరించనున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) గతంలో 13 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, సెప్టెంబర్ 2న మరో నిందితుడి అరెస్టుతో నిందితుల సంఖ్య 14కి చేరింది. మే 12న జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్