మెన్స్ U19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగారు. కేవలం 80 బంతులను ఎదుర్కొని 11 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఆయన ఈ శతకాన్ని పూర్తి చేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, అర్జున్ ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం 33 ఓవర్ల ఆట ముగిసే సమయానికి
భారత్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అర్జున్ రాజ్‌పుత్ బ్యాటింగ్ పరాక్రమంతో
భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.