
సైనికుడిగా గోపీచంద్.. ‘సింగ’ చిత్రంపై భారీ అంచనాలు
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇందులో గోపీచంద్ సైనికుడి పాత్రలో పవర్ఫుల్ లుక్లో కనిపించనున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, అనార్కలి నాజర్ టాలీవుడ్లోకి ఈ సినిమాతో ప్రవేశిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.




