దశరథుడిగా అరుణ్ గోవిల్.. ఫస్ట్‌లుక్‌ విడుదల

1చూసినవారు
దశరథుడిగా అరుణ్ గోవిల్.. ఫస్ట్‌లుక్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ నుంచి నటుడు అరుణ్ గోవిల్ పోషించిన అయోధ్య రాజు దశరథుడి పాత్ర పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. గతంలో రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్‌లో రాముడిగా నటించి గుర్తింపు పొందిన అరుణ్ గోవిల్, దశాబ్దాల తర్వాత మళ్లీ రామాయణ కథలోకి దశరథుడిగా వస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. సినిమా మొదటి భాగం నవంబర్ 6, 2026న, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్