ఐపీఎల్ 2027 సీజన్ కోసం నిర్వహించనున్న ప్లేయర్ల వేలంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన పేరును నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనున్న ఈ మెగా వేలంలో, ఆర్యవీర్ సెహ్వాగ్ రూ.30 లక్షల కనీస ధరతో (బేస్ ప్రైస్) బరిలోకి దిగుతున్నారు. తన తండ్రి బాటలోనే
క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఆర్యవీర్, ఈ వేలంలో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.