ఆసియా కప్: హాంకాంగ్‌పై భారత్‌ భారీ విజయం

2చూసినవారు
ఆసియా కప్: హాంకాంగ్‌పై భారత్‌ భారీ విజయం
ఉమెన్స్ ఆసియా కప్‌-2026లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌పై ఇండియా 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన విధ్వంసకర శతకంతో చెలరేగింది. ఛేదనలో హాంకాంగ్ 56 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, నందిని, శ్రీ చరణ్, ప్రేమ రావత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

సంబంధిత పోస్ట్