ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విభిన్నమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. ఒకే ఒక ఫ్రంట్ లైన్ పేసర్‌ను ఎంచుకుంది. ఎక్స్ట్రా బ్యాటర్‌గా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది. వైభవ్ సూర్యవంశీ 38 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 2 సిక్స్‌లు, 6 ఫోర్లతో దూకుడు చూపించినా లంక బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. ప్రస్తుతం
భారత్ స్కోరు 7 ఓవర్లకు 62/3.