
బెంగళూరులో రాపిడో బైక్ ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి
బెంగళూరులో రాపిడో బైక్ ట్యాక్సీలో వెళ్తున్న ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. ఆటోలలో అధిక ఛార్జీలు ఉండడంతో.. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న రాపిడో బైక్ బుక్ చేసుకున్న వ్యక్తిపై, ఒక ఆటో డ్రైవర్ కదులుతున్న వాహనంపైనే భౌతిక దాడికి దిగాడు. బాధితుడిని వాహనం నుండి కిందకు లాగేందుకు కూడా సదరు డ్రైవర్ యత్నించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




