అంతరిక్షంలో ఫుట్‌బాల్‌ ఆడిన వ్యోమగాములు (వీడియో)

3చూసినవారు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ ఈ వీడియోను 'ఎక్స్‌'లో పంచుకున్నారు. మైక్రో గ్రావిటీలో తేలియాడుతూ బంతిని గోల్‌ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భూమిపైలా పరుగెత్తాల్సిన అవసరం లేకపోవడంతో ఆట తీరు విభిన్నంగా ఉంది. మేనన్‌ మాట్లాడుతూ, 'అంతరిక్ష కేంద్రంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఒకే ఆట ఫుట్‌బాల్. వారాంతంలో కాస్త ప్రశాంతంగా గడపడం, వచ్చే బిజీ వారానికి సిద్ధమవడానికి ఇది సహాయపడుతుంది. ఈ ఆట తమను ఎంతో ఉల్లాసపరిచింది' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్