బంగారు గనులపై దాడి.. 72 మంది మృతి

40చూసినవారు
ఈజిప్ట్.. తమ దేశ సరిహద్దుల్లోని బంగారు గనులపై ఫైటర్ జెట్లతో దాడి చేసిందని సూడాన్‌కు చెందిన మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. ఈ ఘటనలో 72 మంది మరణించారని వెల్లడించాయి. ఈజిప్ట్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. సూడాన్-ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతం, ముఖ్యంగా హలైబ్ ట్రయాంగిల్ ఏరియాలోని బంగారు గనుల్లో సూడాన్ అక్రమ మైనింగ్ చేస్తోందని ఈజిప్ట్ ఆరోపిస్తోంది. ఈ సరిహద్దు ప్రాంతంపై ఇరు దేశాల మధ్య ఎప్పటినుంచో వివాదం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్