కార్గిల్ యుద్ధ వీరుడిపై గురుగ్రామ్లో దాడి చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో వివాదం చెలరేగడంతో రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అమిత్కుమార్ గుప్తాపై పార్కింగ్ సిబ్బంది దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అమిత్కుమార్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తనను చంపేస్తానని బెదిరించినట్లు అమిత్కుమార్ ఆరోపించారు.