ఆడి A6 ఈ-ట్రాన్ కారు సింగిల్ ఛార్జ్‌తో 1,338 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. డ్రైవర్ మికో మార్జిక్ 45 గంటలపాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ కారు WLTP ప్రకారం ఒక్క ఛార్జ్‌తో గరిష్ఠంగా 777 కి.మీ ప్రయాణించగలదు. అయితే రికార్డు ప్రయత్నంలో అదనంగా 561 కి.మీ ప్రయాణించడం విశేషం. 94.9 kWh బ్యాటరీతో 367 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే ఈ కారు 0-100 కి.మీ వేగాన్ని 5.4 సెకన్లలో అందుకుంటుంది.