
చైనాలో 12వ అంతస్తు నుంచి వేలాడిన చిన్నారిని కాపాడిన స్థానికులు
చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో అక్టోబర్ 17వ తేదీన ఊహించని ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, మూడేళ్ల చిన్నారి 12వ అంతస్తు కిటికీ గ్రిల్ నుండి వేలాడుతూ తల ఇరుక్కుపోయింది. ఇది గమనించిన పొరుగువారు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి స్టూల్‌తో చిన్నారికి సపోర్ట్ ఇచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి చిన్నారిని సురక్షితంగా రక్షించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.




