ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ పై ఆసీస్ విజయం

9చూసినవారు
ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్రౌండర్ నిఖిల్ చౌదరీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 188 పరుగుల లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు విఫలమైనా నిఖిల్ 38 బంతుల్లో 66 పరుగులు సాధించి ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నారు. ప్రస్తుతం SMలో ఆయన ట్రెండింగ్‌లో నిలిచారు. ఢిల్లీలో జన్మించిన నిఖిల్, గతంలో ఢిల్లీ, పంజాబ్ జట్లకు దేశవాళీ క్రికెట్ ఆడారు. ఈ ఏడాది జూన్ 17న AUS తరఫున టీ20Iల్లోకి అరంగేట్రం చేశారు.

సంబంధిత పోస్ట్