గుజరాత్‌లోని రాజ్‌కోట్ రింగ్ రోడ్డులోని జగన్నాథ్ చౌక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ నీళ్ల సీసాలను దించుతుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక కారు అతనిపైకి దూసుకెళ్లి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో డ్రైవర్ కారుతో పాటు కొంతదూరం ఈడ్చుకెళ్లబడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.