
రూ.10 వేలు తగ్గిన సిల్వర్ రేట్.. స్థిరంగా బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు వెండి ధరలు భారీగా క్షీణించాయి. కేజీ వెండి ధర ఒక్కసారిగా రూ.10,000 తగ్గి రూ.2,30,000లకు చేరుకుంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మొత్తం రూ.15,000 వరకు ధర తగ్గడం గమనార్హం. మరోవైపు, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,080గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,33,900గా నమోదైంది. ఈ ధరలపై అదనంగా 3% GST వర్తిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.




