
అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ విత్‌డ్రా నిబంధనల్లో మార్పులు.. ఛార్జీలు ఇవే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ బేసిక్ సేవింగ్స్ (BSBD) ఖాతాదారుల కోసం అక్టోబర్ 1 నుండి నగదు ఉపసంహరణ నిబంధనలలో మార్పులు చేయనుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులు నెలకు కేవలం 4 సార్లు మాత్రమే ఏటీఎం లేదా బ్రాంచ్ ద్వారా ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితిని దాటితే, ప్రతి అదనపు విత్‌డ్రాకు రూ.15 + జీఎస్టీ ఛార్జ్ విధించబడుతుంది. అయితే యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు.




