నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. చిత్రీకరణ సమయంలో గాయపడిన బాలకృష్ణ ప్రస్తుతం కోలుకున్నారు. దీంతో నేటి నుంచి ఆయన షూటింగ్లో పాల్గొననున్నారు. బాలయ్యను పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో చూపించేందుకు దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.