తక్కువ క్వాలిటీ మొబైల్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్లపై నిషేధం

8చూసినవారు
తక్కువ క్వాలిటీ మొబైల్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్లపై నిషేధం
మొబైల్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన ప్రొటెక్టర్లను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. గ్లాస్ పరిమాణం, దృఢత్వం, డిస్‌ప్లే స్పష్టత, బ్లూలైట్ ఫిల్టర్ వంటి ప్రమాణాలను తప్పనిసరి చేసింది. స్క్రీన్‌గార్డు ప్యాకెట్‌పై తయారీదారుల వివరాలు, బ్యాచ్ నంబర్, గ్లాస్ మందం వంటి వివరాలు ముద్రించడం తప్పనిసరి. ఈ చర్యతో నాసిరకం ప్రొడక్టుల స్థానంలో నాణ్యమైనవి అందుబాటులోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్