బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకంటే?

16చూసినవారు
బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎందుకంటే?
బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు తమ ప్రధాన డిమాండ్లైన ఐదు రోజుల పనిదినాలు, పెన్షన్ సవరణ, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ లేదా ఆప్షన్, పెన్షనర్లకు యూనిఫార్మ్ డియర్నెస్ అలవెన్స్ వంటి వాటి కోసం సమ్మెకు సిద్ధమయ్యారు. RBI, కేంద్ర ప్రభుత్వం, బీమా రంగాల మాదిరిగానే అన్ని శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలని, పాత జీతాల ప్రకారమే పెన్షన్ అందుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా సవరించాలని, NPS స్థానంలో పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాలని లేదా ఆప్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్