డిసెంబర్ 3న బ్యాంకు ఉద్యోగుల సమ్మె!

54చూసినవారు
డిసెంబర్ 3న బ్యాంకు ఉద్యోగుల సమ్మె!
IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 3న సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో పాల్గొనాలని AIBEA, AIBOA, BEFI యూనియన్లు తమ సభ్యులకు పిలుపునిచ్చాయి. దీనివల్ల బ్యాంకింగ్ సేవలు, నగదు లావాదేవీలు, ఖాతాదారుల సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఖాతాదారులకు ఆన్లైన్ లావాదేవీలు యథాతథంగా అందుబాటులో ఉంటాయని యూనియన్లు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో కీలక సేవలకు విఘాతం కలగనుంది.

సంబంధిత పోస్ట్