అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు బ్యాంకు పనులు ఉన్నవారు సెలవుల వివరాలు ముందుగా తెలుసుకోవాలి. అక్టోబర్ 26న లక్ష్మీపూజ, మహర్షి వాల్మీకి జయంతి తదితర సందర్భాల్లో అగర్తల, బెంగళూరు, చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ 29న కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో, అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. నవంబర్ 1 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో ప్రత్యేక సెలవులు లేని ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి.