ఈ నెలలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి 5 రోజుల పని దినాలు సహా పలు డిమాండ్లపై బ్యాంకర్లు సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. SEP 12 (రెండో శనివారం), 13 (ఆదివారం), 14 (వినాయక చవితి) తేదీల్లోనూ సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో SBI కీలక ప్రకటన చేసింది. కస్టమర్లు తమ ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ముందుగానే పూర్తి చేసుకోవాలని, కస్టమర్ సర్వీస్ పాయింట్లు, ATMలను ఉపయోగించుకోవాలని, ఇంటర్నెట్/YONO/మొబైల్ బ్యాంకింగ్, UPIని ప్రిఫర్ చేయాలని సూచించింది.