వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులు

14చూసినవారు
వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులు
RBI రెపో రేటు పెంచిన నేపథ్యంలో PNB, ఇండియన్ బ్యాంక్, BOB, BOI, IOB, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వంటి ఆరు బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరిగిన వడ్డీ రేట్లు గురువారం, అక్టోబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయి. IOB 8.10% నుంచి 8.35%కి, BOB 7.90% నుంచి 8.15%కి, ఇండియన్ బ్యాంక్ 7.95% నుంచి 8.20%కి వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నిర్ణయం సామాన్యులకు ఆర్థికంగా మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. త్వరలోనే మరిన్ని బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్