
ఫిబ్రవరి 24 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల
ఏపీ ఇంటర్ బోర్డు 2027 పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు జరుగుతాయి. సెలవులను బట్టి తుది షెడ్యూల్లో మార్పులుండొచ్చు.




