TG: క్యూవీఎస్ఈ (క్వాంటమ్ వెస్ట్ స్టాక్ ఎక్సేంజ్) యాప్ ద్వారా ఆన్లైన్ పెట్టుబడి మోసాలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హెచ్చరించారు. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయించి, భారత కరెన్సీని క్రిప్టోగా మార్చి పెట్టుబడి పెడితే 1% లాభం వస్తుందని సైబర్ నేరగాళ్లు నమ్మిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఈ తరహా మోసాలపై 52 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.