
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బియ్యం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన నంద్యాల, కర్నూలు సోనా బియ్యం ధరలు గత మూడు నెలల్లో గణనీయంగా పెరిగాయి. 50 కేజీల నంద్యాల సోనా రూ. 2,600 నుంచి రూ. 3,800కి, కర్నూలు సోనా రూ. 2,400 నుంచి రూ. 3,500కి చేరింది. గత 10 రోజుల్లోనే బస్తాపై రూ. 500 ధర పెరగడం గమనార్హం. ఎల్నీనో ప్రభావంతో వర్షాలు తగ్గి వరి సాగు పడిపోవడం, మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.




