
UPSC మెయిన్స్ ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ 2026 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 1,016 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా.. ఆగస్టు 21, 22, 23, 29, 30 తేదీలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన 13,343 మంది అభ్యర్థులలో, 2,526 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులై తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. అర్హత పొందిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.




