
బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధ పూజ
AP: విజయదశమి సందర్భంగా విజయనగరంలోని బొబ్బిలి కోటలో రాజవంశీయుల ఆయుధ పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. మాజీ మంత్రి రావు సుజయ కృష్ణ రంగారావు బహుదూర్, ఎమ్మెల్యే బేబి నాయన నేతృత్వంలో ఈ వేడుక సాగింది. 1757 నాటి చారిత్రక బొబ్బిలి యుద్ధ జ్ఞాపకార్థం, ఆనాటి ఆయుధాలను భద్రపరిచి ఏటా పూజలు నిర్వహిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ తమ పూర్వీకుల ఆచారాలను కొనసాగిస్తూ, ప్రజల సుఖసంతోషాల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజవంశీయులు తెలిపారు.




