బేతుపల్లి ఘటన.. సీఎం రేవంత్ కీలక ఆదేశం

102చూసినవారు
బేతుపల్లి ఘటన.. సీఎం రేవంత్ కీలక ఆదేశం
TG: ఖమ్మం జిల్లా బేతుపల్లిలో 10 మంది SDRF సిబ్బంది గల్లంతైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గల్లంతైన SDRF సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు సూచించారు. మరోవైపు ఘటనాస్థలికి స్థానిక ఎమ్మెల్యే రాగమయి, కలెక్టర్ దివాకర్ హుటాహుటిన చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్