
కంగనా రనౌత్‌తో రానా దగ్గుబాటి కొత్త హారర్ చిత్రం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో కలిసి కొత్త హారర్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ‘హారర్కాన్ ఇండియా 2026’ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘స్కేరీ పిక్చర్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. కంగనా కూడా ఈ ప్రాజెక్ట్‌ను సోషల్ మీడియాలో ధృవీకరించారు. రవిబాబు హిందీ చిత్ర పరిశ్రమలోకి ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు.




