TG: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, లిబరల్, ప్రగతిశీల భావాలు కలిగిన మేధావులను ఒకే వేదికపైకి తీసుకురావడమే '
భారత్ సమ్మిట్' ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సదస్సు ప్రపంచానికి ప్రజాస్వామ్య, సామాజిక, ఆర్థిక విధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనుందని అన్నారు. ఈ సమ్మిట్‌లో 70కి పైగా దేశాల నుండి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, మేధావులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.