భారత్‌ సమ్మిట్‌.. హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ!

4571చూసినవారు
భారత్‌ సమ్మిట్‌.. హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ!
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ హైదరాబాద్​ రానున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 13 లేదా 14వ తేదీన ఆయన వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్​లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే భారత్​ సమ్మిట్​లో పాల్గొనేందుకు HYD రానున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు రాహుల్​ పర్యటనకు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. హైదరాబాద్​లోని హైటెక్స్‌ వేదికగా మూడు రోజులపాటు భారత్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్