బిగ్‌బాస్‌ ఫేమ్‌ వర్షిణి అరెస్టు

13చూసినవారు
బిగ్‌బాస్‌ ఫేమ్‌ వర్షిణి అరెస్టు
యువకుడిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్న కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షార్ట్‌ఫిల్మ్‌ కోసం పెట్టుబడి పెట్టాలని చెప్పి వర్షిణి తనను మోసం చేసినట్లు చెన్నైకి చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. నగదు తిరిగివ్వాలని అడిగినందుకు ఆగస్టు 22న తనపై దాడి చేసి రెండు సెల్‌ఫోన్లు, రూ.50 వేల నగదు లాక్కున్నారని ఆరోపించాడు. అనంతరం ఫోన్‌ చేసి బెదిరించి రూ.5 లక్షలు తీసుకున్నారని, రూ.27 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసులో వర్షిణితో పాటు సంజయ్‌ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్