బిహార్ యువకుడిపై కత్తితో దాడి (వీడియో)

11చూసినవారు
AP: కృష్ణా జిల్లాలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కంకిపాడు శివారులో చోటుచేసుకుంది. డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన యువకుడు అనిల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్