TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి గాయపడ్డాడు. మూసాపేటకు చెందిన విశ్లావత్ సాయికుమార్ (31) మంగళవారం కూకట్‌పల్లి నుంచి మూసాపేటకు వెళ్తుండగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ ఆగిపోయింది. దీంతో కిందకు దిగి కిక్ కొడుతుండగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో సాయికుమార్ గాయపడగా, బైక్ పూర్తిగా కాలిపోయింది. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పెట్రోల్ లీకేజీ లేదా ఎలక్ట్రికల్ స్పార్క్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.