రెండేళ్ల కనిష్ఠానికి బిట్‌కాయిన్‌

5చూసినవారు
రెండేళ్ల కనిష్ఠానికి బిట్‌కాయిన్‌
బిట్‌కాయిన్‌ ధర భారీగా పతనమై రెండేళ్ల కనిష్ఠానికి చేరింది. శుక్రవారం అమెరికా మార్కెట్లో 6 శాతం, శనివారం ఆసియా మార్కెట్లో మరో 5.7 శాతం తగ్గి 55,533 డాలర్లకు పడిపోయింది. 2024 సెప్టెంబర్‌ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి. గతేడాది అక్టోబర్‌లో 1.26 లక్షల డాలర్ల గరిష్ఠానికి చేరిన బిట్‌కాయిన్‌ ఏడాదిలోనే 70 వేల డాలర్లకు పైగా నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, పెట్టుబడుల ఉపసంహరణ, బైనాన్స్‌ హ్యాకింగ్‌, అమెరికాలో క్రిప్టో నిబంధనలపై ఆందోళనలు ఈ పతనానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్