
ఇండోర్ గర్బా వేడుకలో మైనర్ బాలికపై బీజేపీ నేత దాడి (VIDEO)
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం కంకేశ్వరి మైదానంలో గురువారం రాత్రి జరిగిన గర్బా వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాస్ విషయంలో స్థానిక బీజేపీ నేత కమల్ చౌహాన్ 15 ఏళ్ల మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను బయటకు గెంటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబం హీరా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై POCSO, BNS సెక్షన్ 74 కింద కేసు నమోదైంది. నిందితుడిపై పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.




