మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భారీ బ్లాస్టింగ్లపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన, అనుమతులు లేకుండా ఈ పనులు ఎలా చేపడుతున్నారని అధికారులను నిలదీశారు. నిబంధనల ప్రకారం 400 మీటర్ల దూరంలో జరగాల్సిన బ్లాస్టింగ్లు, కేవలం 100-200 మీటర్ల దూరంలోనే జరుగుతున్నాయని ఆయన అభ్యంతరం తెలిపారు. మేడిగడ్డ తరహాలోనే మల్లన్న సాగర్ భద్రతను ప్రమాదంలోకి నెట్టే కుట్ర జరుగుతోందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.