ఢాకా వేదికగా నవంబర్ 15 నుండి 20 వరకు జరగనున్న రెండో అంధుల
క్రికెట్ ఆసియా కప్ కోసం 17 మంది సభ్యుల భారత జట్టును
క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్
ఇండియా (CABI) ప్రకటించింది. పది రోజుల శిక్షణ అనంతరం దుర్గారావు తోంపాకి నాయకత్వంలో ఈ జట్టును ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ పర్యటనకు ముందు ఆటగాళ్లు ఢిల్లీలో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గొంటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించేలా ఈ శిబిరాన్ని రూపొందించారు.