
శ్రీలంక గైడ్ను సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ పర్యాటకుడు (వీడియో)
శ్రీలంకలో సముద్ర విహారానికి వెళ్లిన పడవలో ఓ ఇజ్రాయెల్ పర్యాటకుడు మహిళా గైడ్ను సముద్రంలోకి తోసేశాడు. ఆమె నీరు తాగుతుండగా పక్కనే కూర్చున్న పర్యాటకుడు ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇతర పర్యాటకులు ఆమెకు సాయం చేయకుండా నవ్వుతూ ఉండటం వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పర్యాటకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, మహిళా గైడ్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.




