బోటు ప్రమాదం.. ఇద్దరు మత్స్యకారులు మృతి (వీడియో)

3చూసినవారు
AP: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు మృతదేహాలు గుర్తించారు. మృతులు చెన్నైకి చెందిన మత్స్యకారులు నారాయణ, రాజేష్‌గా గుర్తించారు. సముద్రంలో బోటు ప్రమాదానికి గురవ్వగా.. సముద్ర అలల ఉధృతికి లక్ష్మీపురం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్దకు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. సమాచారం అందుకున్న ఇసుకపల్లి మెరైన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్