
తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాలు, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




