AP: పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాలూరులోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో బైక్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.