పలు ఐరోపా దేశాల్లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో బూటకపు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. ఒక్క ఇటలీలోనే 300కు పైగా పాఠశాలలకు ఇటువంటి బెదిరింపులు రాగా, అధికారులు వెంటనే అప్రమత్తమై
విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా తరలించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ, ఈ బెదిరింపులు పూర్తిగా బూటకమని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్కాట్లాండ్, ఐర్లాండ్‌లో కూడా ఇలాంటి మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమైనప్పటికీ, అవి బూటకమని తేలడంతో తరగతులకు ఎలాంటి అంతరాయం కలగలేదు.