అహ్మదాబాద్‌-HYD ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

35చూసినవారు
అహ్మదాబాద్‌-HYD ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందని ఒక విద్యార్థిని హెచ్చరించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే స్పందించి, విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, బాంబ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా సిబ్బంది విమానంలో అనుమానాస్పద వస్తువుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్